రావిశాస్త్రి గా ప్రసిద్ధి చెందిన రాచకొండ విశ్వనాథశాస్త్రి (1922 జూలై 30 - 1993 నవంబర్ 10) తెలుగు సాహితీ లోకంలో అగ్రగణ్యుడైన కథా రచయిత, నవలకారుడు మరియు న్యాయవాది. సమాజంలో పైతరగతుల అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురవుతున్న దీన, హీన ప్రజల తరపున తన కలం ద్వారా వకాల్తా పుచ్చుకుని సాంఘిక న్యాయం కోసం పోరాడిన అభ్యుదయ రచయిత ఆయన